RRR censor review: పరిస్థితి అంతా బాగుండి ఉంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' ఇప్పటికే విడుదలై బాక్సాఫీస్ ముందు రికార్డులు సృష్టించేది. జనవరి 7న విడుదవ్వాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడీ చిత్ర సెన్సార్ రివ్యూ అంటూ ఓ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు.. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. 'మైండ్ బ్లోయింగ్'గా ఉందంటూ సెన్సార్ పేర్కొందని ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటన టాక్ ఆఫ్ ది టౌన్ అని ప్రశంసించారు. ఈ ట్వీటే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న అభిమానుల ఉత్సాహం మరింత రెట్టింపు అయింది.
ఆర్‌ఆర్‌ఆర్ సెన్సార్ రివ్యూ RRR movie budget: యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్లు, గ్లింప్స్, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: 'ఆర్‌ఆర్‌ఆర్', 'పుష్ప' స్పూఫ్.. చూస్తే వావ్ అనాల్సిందే!