తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నెట్టింట వైరల్​గా 'ఆర్​ఆర్​ఆర్' పోస్టర్​ - అల్లూరి సీతారామరాజు

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ​ఈ సినిమాపై రోజురోజుకి అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుండగా.. తాజాగా ఓ అభిమాని పెట్టిన పోస్టర్​ నెట్టింట వైరల్​గా మారింది. దీనిపై చిత్రబృందం కూడా స్పందించింది.

RRR_Movie-cartoons-Viral_in-twitter
నెట్టింట వైరల్​గా 'ఆర్​ఆర్​ఆర్' పోస్టర్​

By

Published : Dec 29, 2019, 6:28 PM IST

'బాహుబలి' సిరీస్‌ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్​ సినిమా 'ఆర్.ఆర్.ఆర్'పై విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నూతన సంవత్సరం కానుకగా చిత్రబృందం నుంచి ఏదైనా సర్​ప్రైజ్​ వచ్చే అవకాశముందని సమాచారం ఉండగా.. తాజాగా సినిమాలోని పాత్రల ఆధారంగా రూపొందిన ఓ పోస్టర్​ నెటిజన్లను ఆకట్టుకుంది. ఇది విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

జక్కన్నకు వీరాభిమాని అయిన ఓ కార్డూనిస్ట్​ ఈ పోస్టర్​ను రూపొందించాడు. సినిమాలో చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్‌ పాత్రలో తారక్‌ దర్శనమివ్వబోతున్నారు. ఇవే పాత్రలతో ఊహించిన రూపంలో పోస్టర్​ను గీశాడు. ఇందులో ఇద్దరు హీరోలు స్వాతంత్ర్య పోరాటం కోసం చేతులు కలిపినట్లు కనిపించారు. దీనిపై చిత్రబృందం కూడా ప్రశంసలు వర్షం కురిపించింది. అంతేకాకుండా ఆ అభిమాని తయారు చేసిన చిత్రాన్ని... #యేదోస్తీ పేరుతో హ్యాపీ ఆర్ఆర్‌ఆర్‌ ఇయర్‌ అనే ట్యాగ్స్​తో రీట్వీట్​ చేసింది.

ఈ చిత్రంలో తొలిసారి రామ్‌చరణ్‌ - ఎన్టీఆర్‌ కలిసి తొలిసారి నటిస్తున్నారు. అధికారికంగా ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి చెర్రీ - తారక్‌ల పాత్రలపై ఒక్క పోస్టర్‌ కూడా బయటకు రాలేదు. కొత్త ఏడాది కానుకగా ఈ ఇద్దరి ఫస్ట్‌లుక్‌ సహా టైటిల్​ను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్​ నటులు ఓలీవియా మోరిస్​, రే స్టీవెన్​ సన్​, అలిసన్​ డూడీ, మైఖేల్​ మ్యాడిసన్​లతో పాటు అజయ్​ దేవ్​గన్​, ఆలియా భట్​ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:- పవన్​ చారిత్రక సినిమా.. కీరవాణితో తొలిసారి

ABOUT THE AUTHOR

...view details