తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్టీఆర్​ డబుల్​ హ్యాట్రిక్ హిట్​.. ఆమిర్​-మోహన్​లాల్​ కలిసిన వేళ - tapsee mission impossible making video

కొత్త సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో 'ఆర్​ఆర్​ఆర్'​, 'మిషన్​ ఇంపాజిబుల్​', ఆమిర్​, మోహన్​లాల్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

NTR
ఎన్టీఆర్​ ొ

By

Published : Mar 27, 2022, 5:49 PM IST

NTR Double hattrick hit: 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం సూపర్ హిట్​ అవ్వడం వల్ల యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ అరుదైన ఘనత సాధించారు. 2015లో వచ్చిన 'టెంపర్'​ ముందు 'రామయ్య వస్తావయ్యా', 'రభస' వంటి భారీ డిజాస్టర్లను ఎదుర్కొన్న ఎన్టీఆర్​.. ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్'​, 'జై లవకుశ', 'అరవింద సమేత', 'ఆర్​ఆర్​ఆర్'​ వరకు వరుసగా ఆరు హిట్​లు కొట్టారు. ఈ చిత్రాల్లో ఏ ఒక్కటి అభిమానులను నిరుత్సాహపరచలేదు. దీంతో ఆయన డబుల్​ హ్యాట్రిక్​ను అందుకున్నారు. ​​ఈ మధ్య కాలంలో ఇతర ఏ బాడా హీరో కూడా ఇలాంటి ఘనతను సాధించలేదు!

ఎన్టీఆర్‌ నటనకు ప్రేక్షకుల కన్నీరు: కొన్ని సినిమాలు, సన్నివేశాలు ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. కామెడీ సీన్స్‌ ఎలా నవ్విస్తాయో, భావోద్వేగ సన్నివేశాలు అంతలా కంటతడి పెట్టిస్తాయి. అలాంటి నటనతో ప్రేక్షకులను కట్టిపడేయటం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల యువ నటుల్లో ఎన్టీఆర్‌ ఒకరు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా స్నేహానికి ప్రాణమిచ్చే కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ ఒదిగిపోయారు. తెరపై కొన్ని సన్నివేశాల్లో ఆయన ప్రదర్శించిన అమాయకత్వం, రామ్‌తో కలిసి చేసే పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటన మెప్పిస్తోంది. ఇక ‘కొమురం భీముడో’ పాటలో ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకులతో కన్నీరు పెట్టిస్తోంది. ఆ పాటలో ఎన్టీఆర్‌ను రామ్‌చరణ్‌ కొడుతుంటే థియేటర్‌లో ప్రేక్షకుల కళ్లు చెమర్చుతున్నాయి. థియేటర్‌లో ఆ సన్నివేశం చూస్తూ ఓ మహిళ భావోద్వేగానికి గురవుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. కాలభైరవ ఆలపించారు.

Tapsee Mission Impossible Making video: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీమ్‌ను పట్టుకుంటే డబ్బులిస్తారనే ముగ్గురు చిన్నారుల ఆశ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'మిషన్‌ ఇంపాజిబుల్‌'. బాలనటులు రోషన్‌, భానుప్రకాశ్‌, జైతీర్థ ప్రధాన పాత్రధారులు. కథానాయిక తాప్సీ కీలక పాత్ర పోషించింది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. పల్లెటూరి వాతావరణంలో సినిమా రూపొందినట్టు, సరదాగా షూటింగ్‌ సాగినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మార్క్‌ కె. రాబిన్‌ స్వరాలందించారు.

ఇద్దరు దిగ్గజాలు కలిసిన వేళ: బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌, మలయాళ నటుడు మోహన్‌లాల్‌ కలిసి దిగిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కళ్లజోడు, గళ్ల చొక్కాతో ఆమిర్‌.. టోపీ, నీలి రంగు టీ షర్టుతో మోహన్‌లాల్‌ స్టైలిష్‌గా కనిపించి, అభిమానులతో ‘వావ్‌’ అనిపించేలా ఉన్నారు. ఈ ఫొటోపై ఇప్పటికే కొందరు నెటిజన్లు స్పందించారు. ‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్‌’, ‘పిక్చర్ అదిరింది’ అంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు తెరకెక్కే అవకాశాలున్నాయని, అందుకే కలిశారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నిజమా, కాదా? అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చద్ధా’ ఆగస్టు 11న విడుదలకానుంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. కరీనా కపూర్ కథానాయిక. షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మరోవైపు ‘12th మ్యాన్‌’, ‘ఎలోన్‌’ తదితర చిత్రాలతో మోహన్‌లాల్‌ బిజీగా ఉన్నారు.

మోహన్​లాల్​ ఆమిర్​

ఇదీ చూడండి: యాక్షన్​ మోడ్​లో 'చిరు 154'.. 'సూపర్​ గర్ల్'​ మూవీ షూటింగ్​ షురూ

ABOUT THE AUTHOR

...view details