తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​' విడుదల తేదీకి 'కేజీఎఫ్​ 2'..! - ప్రశాంత్​ నీల్​

దక్షిణాదిలో తెరకెక్కుతోన్న పాన్​ ఇండియా చిత్రాలు 'ఆర్​ఆర్​ఆర్​', 'కేజీఎఫ్​​ 2'. ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తాయా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా ఓ తీపి కబురు అందింది. ఈ చిత్రాల విడుదల తేదీలపై ఓ స్పష్టత వస్తోంది.

RRR-KGF Chapter2-Release-Dates-Confirmed
'ఆర్​ఆర్​ఆర్​' విడుదల తేదీకే 'కేజీఎఫ్​ 2'..!

By

Published : Feb 6, 2020, 9:28 AM IST

Updated : Feb 29, 2020, 9:12 AM IST

భారీ బడ్జెట్​తో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​', ప్రశాంత్​ నీల్​ రూపొందిస్తున్న 'కేజీఎఫ్​ 2' చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ రెండు చిత్రాల విడుదలపై ఓ స్పష్టత వచ్చింది. జక్కన్న.. గతంలో తన చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ మల్టీస్టారర్​ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్రబృందం.

ఈ ఏడాదే కేజీఎఫ్ 2..

జక్కన్న వదిలేసిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల తేదీని ప్రశాంత్‌ నీల్‌ కొట్టేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే జులై 30పై జాతీయ స్థాయిలో అంచనాలు ఏర్పడటం వల్ల అదే తేదీకి 'కేజీఎఫ్‌ 2'ను తీసుకొస్తే ప్రచారపరంగా కలిసొచ్చే అవకాశముందని చిత్రబృందం ఆలోచన చేస్తోంది. ప్రశాంత్‌ బృందం ఈ తేదీనే లాక్‌ చేయనున్నారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఇదీ చూడండి.. ఇక సమంతగా కాదు.. 'జాను'గా గుర్తుండిపోతా..!

Last Updated : Feb 29, 2020, 9:12 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details