తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR in 3D: 3డీలో 'ఆర్​ఆర్​ఆర్'​.. ప్రేక్షకులకు రాజమౌళి సర్​ప్రైజ్​ - rajamouli

RRR in 3D: ఇప్పటికే అనేక హంగులతో రూపొందిన 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం.. మరో ప్రత్యేకతతో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను 3డీలోనూ విడుదల చేస్తున్నట్లు తెలిపారు దర్శకధీరుడు రాజమౌళి.

rrr movie
rrr in 3d

By

Published : Mar 15, 2022, 4:36 PM IST

RRR in 3D: ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తోన్న సినిమా 'ఆర్​ఆర్​ఆర్​'. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈనెల 25న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు రాజమౌళి ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. కరోనా వల్ల దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని 'ఆర్​ఆర్​ఆర్'​ను 3డీ రూపంలోనూ తీర్చిదిద్దారు. మార్చి 25 నుంచి 3డీలో ప్రదర్శించేందుకు అనుకూలంగా ఉన్న థియేటర్లలో 'ఆర్​ఆర్​ఆర్​'ను 3డీలో అనుభూతి చెందవచ్చని రాజమౌళి తెలిపారు.

ఐమ్యాక్స్​ వెర్షన్​లోనూ 'ఆర్​ఆర్​ఆర్​'

టికెట్ రేట్​ రెండింతలు?

ఇప్పటికే 'ఆర్​ఆర్​ఆర్​'ను ఐమాక్స్, డాల్బీ ఫార్మాట్​లో సిద్ధం చేసిన జక్కన్న.. గత 3డీ చిత్రాల తరహాలో కాకుండా అత్యాధునిక సాంకేతికతతో 'ఆర్​ఆర్​ఆర్​'ను మలిచారు. అయితే 3డీలో 'ఆర్​ఆర్​ఆర్​' చూడాలంటే సాధారణ థియేటర్​లో టికెట్ కంటే రెండు రెట్లు అధికంగానే టికెట్ ధరలు ఉంటాయని తెలుస్తోంది.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చూడండి:RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' 'ఎత్తర జెండా' వీడియో సాంగ్‌ వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details