తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్'​కు రాజమౌళి ఒక్కడే దర్శకుడు కాదు! - entertainment news

'ఆర్ఆర్​ఆర్'కు రాజమౌళితో పాటు మరో వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడని గూగుల్ తల్లి చెబుతోంది. నమ్మకం కుదరడం లేదా అయితే ఓసారి చెక్ చేసుకోండి.

'ఆర్ఆర్ఆర్'​కు రాజమౌళి ఒక్కడే దర్శకుడు కాదు!
ఆర్ఆర్ఆర్ సినిమా

By

Published : Feb 23, 2020, 6:53 AM IST

Updated : Mar 2, 2020, 6:21 AM IST

పైన టైటిల్​ చూడగానే ఒక్కసారిగా షాకింగ్​గా అనిపించిందా? కచ్చితంగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అని అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మరో డైరెక్టర్ ఎవరబ్బా అనే కదా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా.

అసలు జరిగింది ఏంటంటే?

'ఆర్ఆర్ఆర్' అని గూగుల్ సెర్చ్ చేస్తే, అందుకు సంబంధించిన​ వికిపీడియా పేజ్ ఓ పక్కన కనిపిస్తుంది. అందులో అందరి పేర్లు సరిగ్గానే ఉన్నా, దర్శకుడు అని రాసున్న చోట రాజమౌళి పేరుతో పాటు సంజయ్ పాటిల్ అని ఉంది. ఈ విషయం ఇప్పుడు వైరల్​గా మారింది.

'ఆర్ఆర్​ఆర్' దర్శకుడి పేరు తప్పుగా చూపిస్తున్న గూగుల్

రామ్​చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. సుమారు రూ.350 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ
షూటింగ్ ముగించుకున్న అలీసన్ డూడీ
Last Updated : Mar 2, 2020, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details