'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజు-కొమరం భీమ్ పాత్రలతో తలపడే విలన్ పాత్రధారి వచ్చేసింది. లేడీ స్కాట్‌గా కనిపించనున్న ఐరిష్ నటి అలీసన్ డూడీ.. భారత్‌కు వస్తున్నట్లు ఇన్‌స్టాలో ఆదివారం ఓ వీడియోను పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది.
కొద్దిరోజులు క్వారంటైన్లో ఉండనున్న ఈమె.. ఆ తర్వాత చిత్రీకరణలో పాల్గొనే అవకాశముంది. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఆ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలోనూ పంచుకుంది. గతనెల 22 కొమరం భీమ్ జయంతి సందర్భంగా తారక్ టీజర్‌ను కూడా విడుదల చేశారు.
రూ. 350 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానుందీ సినిమా.