RRR Australia NTR fans cars rally: 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్‌ను పురస్కరించుకుని గత వారం రోజులుగా ప్రపంచదేశాల్లో భారీ హడావిడి నెలకొంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో వినూత్నంగా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలోని తారక్ ఫ్యాన్స్ ర్యాలీ చేపట్టారు. 70కి పైగా కార్లను 'జై ఎన్టీఆర్', 'ఆర్ఆర్ఆర్' ఆకృతిలో ప్రదర్శించారు. అంతేకాకుండా 'లవ్ యు తారక్ అన్న... మీ మెల్బోర్న్ ఫాన్స్' అంటూ బ్యానర్ రూపొందించి ప్రత్యేక ఫ్లైట్ ద్వారా ఆకాశంలో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆస్ట్రేలియాలో తారక్ క్రేజ్.. 'జై ఎన్టీఆర్' ఆకృతిలో కార్ల ర్యాలీ - ఆర్ఆర్ఆర్ రామ్‌చరణ్
RRR Australia NTR fans cars rally: మరి రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందానికి వినూత్న రూపంలో విషెస్ తెలిపారు ఆస్ట్రేలియాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్ఆర్ఆర్', 'జై ఎన్టీఆర్' ఆకృతిలో వాటిని అమర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ర్యాలీ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. "మా అభిమాన హీరో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాలర్ ఎగరేసుకునేలా మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్నందుకు గర్వంగా ఉంది" అని అన్నారు. కాగా, రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
ఇదీ చూడండి: తొలి భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' మరో రికార్డ్.. కెనడాలో ఫ్యాన్స్ హంగామా