తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రౌడీ బేబీ'... యూట్యూబ్​లో 'రికార్డ్​ బేబీ' - maari

'మారి 2' చిత్రంలోని 'రౌడీ బేబీ' పాట యూట్యూబ్​లో రికార్డు సృష్టించింది. దక్షిణాదిన 50 కోట్ల మంది చూసిన వీడియోగా ఘనత సాధించింది.

రౌడీబేబీ

By

Published : Jun 2, 2019, 4:36 PM IST

ధనుష్​, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'మారి 2'. ఈ సినిమాలోని 'రౌడీబేబీ' పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయిపల్లవి, ధనుష్ డ్యాన్స్​కు యువత ఫిదా అయ్యారు. ఈ కారణంగా యూట్యూబ్​లో రికార్డు సృష్టిస్తోందీ పాట.

యూట్యూబ్​లో దక్షిణాదిన 50 కోట్ల మంది చూసిన వీడియోగా రికార్డు సృష్టించింది రౌడీ బేబీ పాట. అంటే ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సాంగ్​లోని లిరిక్స్​, కొరియోగ్రఫీ ఆకట్టుకోవడం ఇందుకు కారణం.

ఇంతకుముందు 'త్రీ' సినిమా నుంచి 'కొలవెరి డీ', 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే' పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. 'రౌడీబేబీ' పాట వీటన్నింటినీ దాటుకుని శిఖరాగ్రాన నిలిచింది. 'వచ్చిండే', 'రౌడీ బేబీ' రెండు పాటలూ ఇంతలా ఫేమస్ కావడానికి కారణం సాయిపల్లవి డ్యాన్స్​ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుదేవా కొరియోగ్రఫీ మరో కారణం.

రౌడీ బేబీ

ఇవీ చూడండి.. కశ్మీర్​లో మిలటరీ దుస్తుల్లో ప్రకాశ్​రాజ్​

ABOUT THE AUTHOR

...view details