బాలీవుడ్ చిత్రం 'గల్లీ బాయ్' వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ర్యాప్‌పై మక్కువ పెరుగుతోంది. చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా తమ ర్యాప్ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వృద్ధురాలు పాట పాడి ర్యాప్ నాని పేరుతో అంతర్జాలంలో పెట్టేసింది. ఇంకేముంది నెటిజన్లు ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.
బామ్మ ర్యాప్... ఆన్లైన్లో సూపర్ హైప్..! - song
'గల్లీ బాయ్' పాటను పేరడి చేసింది ఓ వృద్ధురాలు." కైసా ఏ జమానా హై.. ఆద్మీ దివానా హై" అంటూ ట్రెండ్‌కు తగ్గట్టుగా పాడింది. ఈ పాటపై హీరో రణ్‌వీర్‌సింగ్ స్పందించాడు.
బామ్మ ర్యాప్
'గల్లీ బాయ్' చిత్రంలోని అప్నా టైమ్ ఆయేగా పాటను పేరడి చేసిందీ బామ్మ. "కైసా ఏ జమానా హై.. ఆద్మీ దివానా హై" అంటూ ట్రెండ్‌కు తగ్గట్టుగా పాడింది. సిస్టమ్ ఖారబ్ హై అంటూ ప్రస్తుతం సమాజంపై వ్యంగ్యంగా ఆలపించింది. ఈ పాటపై నెటిజన్లతో పాటు హీరో రణ్వీర్ సింగ్ కూడా స్పందించాడు. "ఆంటీ జీ బహుత్ హార్డ్" అంటూ ట్విట్టర్లో ప్రశంసించాడు.