శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'వాల్మీకి' సెట్లోకి అనుకోని అతిథి వచ్చారు. ఆయనే హాలీవుడ్ ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ రిచర్డ్సన్. ఈ ఆస్కార్ విజేత సందర్శించడమే కాకుండా దర్శకుడుతో కలిసి కొన్ని సీన్లను తెరకెక్కించారు. ఆ ఫొటోల్ని ట్విట్టర్లో పంచుకున్నాడు హరీశ్ శంకర్.
"సినిమాటోగ్రాఫీకి దేవుడి లాంటి వ్యక్తి.. వాల్మీకి సెట్స్‌ను సందర్శించారు. మూడు సార్లు ఆస్కార్ విజేత మీ కోసం కెమెరాను ఆపరేట్ చేస్తుంటే ఏం చెప్పగలరు. నేనైతే ఆ షాక్ నుంచి తేరుకుని యాక్షన్ చెప్పా." -ట్విట్టర్లో దర్శకుడు హరీశ్ శంకర్