తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దులతో మురిపిస్తున్న హాసిని - genelia

'బొమ్మరిల్లు' హీరోయిన్ జెనీలియా ముద్దులతో మురిపిస్తున్న వీడియో ఒకదాన్ని భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో సందడి చేస్తుంది.

జెనీలియా

By

Published : Sep 7, 2019, 5:02 AM IST

Updated : Sep 29, 2019, 5:45 PM IST

"ఒక్కసారి ఇద్దరి తలలు ఢీకొంటే కొమ్ములొస్తాయి... అలా కాకూడదంటే రెండోసారు ఢీకొనాలి" అని చెబుతుంది హాసిని. 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసిని రావుగా కనిపించిన జెనీలియా డిసౌజా ఆ సినిమాలో తనదైన శైలిలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ముద్దులతో మురిపిస్తున్న వీడియో ఒకదాన్ని భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌కు.."జుమ్మా చుమ్మా దే దే" అనే క్యాప్షన్‌ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

తన తొలి బాలీవుడ్ సినిమా హీరో రితేశ్ దేశ్​ముఖ్​ను దాదాపు 9 ఏళ్లు ప్రేమించి 2012లో పెళ్లి చేసుకుంది జెనీలియా. తర్వాత నటనకు విరామం ఇచ్చేసి.. ప్రస్తుతం ఇద్దరు కుమారులతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. త్వరలోనే మళ్లీ తెరపైకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవీ చూడండి.. ఆ 'ఏడు' హిట్టయితే.. టాలీవుడ్​ లెక్క మారేది..!

Last Updated : Sep 29, 2019, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details