తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త సినిమాలో రిషి కపూర్ కీలక పాత్ర - Jhootha Kahin Ka cinema

అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్న రిషి కపూర్.. ప్రస్తుతం 'జూటా కహిన్ కా' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మేరకు రిషికపూర్​ ఉన్న పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

కొత్త సినిమాలో రిషి కపూర్ కీలక పాత్ర

By

Published : Jun 28, 2019, 9:54 AM IST

Updated : Jun 28, 2019, 11:21 AM IST

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ మరోసారి వెండి తెరపై కనిపించనున్నారు. అనారోగ్య సమస్యతో కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈయన ప్రస్తుతం ‘జూటా కహిన్‌ కా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ఓంకార్‌ కపూర్, సన్నీ సింగ్, జిమ్మీ షెర్గిల్, మనోజ్‌ జోషి కనిపించనున్నారు. స్మీప్‌ కంగ్‌ దర్శకుడు.

రిషికపూర్‌ ఉన్న ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇద్దరు వ్యక్తులను బల్బులతో కూడిన విద్యుత్తు తీగతో బంధించినట్టు ఉన్న ఈ లుక్ ఆకట్టుకుంటోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వస్తోన్న ఈ సినిమాతో విజయం వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రిషి. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిషి కపూర్ కొత్త సినిమా పోస్టర్

ఇది చదవండి: 'మొండితనం వల్లే మూవీ ఆఫర్లు కోల్పోయా' అంటున్న మల్లికా షెరావత్

Last Updated : Jun 28, 2019, 11:21 AM IST

ABOUT THE AUTHOR

...view details