శృంగార తార 'షకీలా' జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'షకీలా' విడుదలకు సిద్ధమైంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని వెల్లడించిన చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నటి రిచా చద్దా, ఓ తుపాకీ పట్టుకుని హాట్‌లుక్‌లో కనిపించింది. లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న మూడో బాలీవుడ్ చిత్రమిది.
'షకీలా' బయోపిక్‌లో రిచా హాట్ లుక్‌తో - shakeela biopic chrismas
రిచా చద్దా ప్రధాన పాత్రలో నటించి 'షకీలా' సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటన చేయడం సహా కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
షకీలా
ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పంకజ్ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి : షకీలా సినిమాకు 'యూ' సర్టిఫికేట్
Last Updated : Nov 30, 2020, 5:19 PM IST