తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ద్రవిడ్ నా ఫస్ట్​ లవ్.. అతడి కోసం మళ్లీ..' - ద్రవిడ్

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్ (richa chadha rahul dravid) అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది నటి రిచా చద్ధా. అతడు రిటైరైన తర్వాత ఆటను చూడటం మానేసిందట. అయితే భారత జట్టు కోచ్​గా అతడు బాధ్యతలు స్వీకరించడం వల్ల మరోసారి క్రికెట్​ను ఫాలో అవుతానని చెబుతోంది.

Richa Chadha
రిచా చద్ధా

By

Published : Nov 23, 2021, 2:05 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి, ప్రస్తుత హెడ్​ కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పింది నటి రిచా చద్ధా (richa chadha rahul dravid). అతడి కోసమే ఒకప్పుడు క్రికెట్ చూసేదట. ద్రవిడ్ రిటైరైన తర్వాత ఆటను చూడటం మానేశానని, ఇప్పుడు ప్రధాన కోచ్​గా అతడు డ్రెస్సింగ్​ రూమ్​లో కనబడుతుంటే మరోసారి క్రికెట్ చూడడం ప్రారంభిస్తానని చెప్పింది.

రాహుల్​ ద్రవిడ్

"చిన్నప్పుడు క్రికెట్​ను పెద్దగా అభిమానించేదాన్ని కాదు. నా సోదరుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఆటను టీవీలో అప్పుడప్పుడూ చూసేదాన్ని. రాహుల్​ ద్రవిడ్ ఆట అంటే చాలా ఇష్టం. అతడు ఆట నుంచి మెల్లగా తప్పుకునే క్రమంలో ఇక నేను క్రికెట్ చూడటమే మానేశాను. అతడే నా ఫస్ట్​ లవ్."

-రిచా చద్ధా, నటి

అయితే ద్రవిడ్.. ప్రస్తుతం ఆటగాడిగా లేకున్నా.. టీమ్ఇండియా డ్రెస్సింగ్​ రూమ్​లో కనిపిస్తే చాలట రిచాకు. ఇప్పటి నుంచి క్రికెట్​ను ఫాలో అవుతా అని చెబుతోంది.

రిచా చద్ధా

ABOUT THE AUTHOR

...view details