బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణించిన నెలరోజుల తర్వాత స్పందించిన నటి, ప్రేయసి రియా చక్రవర్తిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జులై 14న అతడిని ఉద్దేశిస్తూ ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసిందీ భామ. అతడిపై అనంతమైన ప్రేమ ఉందని, ప్రస్తుతం ఎంతగానో మిస్ అవుతున్నట్లు వెల్లడించింది.
అయితే ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సుశాంత్ బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోలేని రియా.. ప్రస్తుతం దొంగ ప్రేమ చూపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
"నీ ప్రియుడు మరణించిన నెలరోజులకు అకస్మాత్తుగా గుర్తొచ్చాడా? అతడి మరణానికి దర్శకుడు మహేష్‌భట్ కారణమని నీకు తెలియదా? వింతగా ఉందే. అతడిని చంపిన ఈ హంతకులకు ఏ శిక్ష వేసినా సరిపోదు." అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
"సుశాంత్ బ్రతికి ఉన్నప్పుడు పక్కన పెట్టింది. ఇప్పుడేమో అమితమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది.!"