'ఇండో పాక్' నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న 'చాణక్య' చిత్రం ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా రిలీజ్ చేసిన మరో పోస్టర్లో గోపీచంద్ రఫ్ లుక్‌తో అలరిస్తున్నాడు.
వరుస పరాజయాలతో డీలాపడ్డ యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరో గోపీచంద్. పవర్ఫుల్ టైటిల్‌తో రాబోయే ఈ చిత్రంతో.. తమిళ దర్శకుడు తిరు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.
'చాణక్య' కోసం రఫ్ లుక్‌లో గోపీచంద్ - చాణక్య స్టిల్స్
గోపీచంద్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'చాణక్య'. ఈ సినిమాలోని హీరో మరో కొత్తలుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
చాణక్య స్టిల్
ఈ సినిమలో గోపీచంద్‌కు జంటగా మెహరీన్ నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తోన్న 'చాణక్య' షూటింగ్ సగ భాగం పూర్తయ్యింది. వీలైనంత తొందరగా చిత్రీకరణ పూర్తి చేసి నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇది చదవండి;'నువ్వు ఆడుకున్నది నాతో కాదు.. యముడితో'