తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections 2021: మంచు విష్ణు విజయానికి కారణాలు ఇవే! - మా ఎలక్షన్ 2021 లేటెస్ట్ న్యూస్

ఎంతో హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎలక్షన్​లో హీరో మంచు విష్ణు గెలుపు సొంతం చేసుకున్నారు. ప్రకాశ్​రాజ్​పై అద్భుత విజయం సాధించారు.

manchu vishnu won maa elections 2021
మంచు విష్ణు

By

Published : Oct 10, 2021, 10:52 PM IST

'మా' ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. రాబోయే రెండేళ్ల పాటు.. అంటే 2021-23కిగానూ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే విష్ణు విక్టరీ వెనకున్న కొన్ని అంశాలు మీకోసం.

  1. 'లోకల్-నాన్ లోకల్' అంశం విష్ణుకు బాగా కలిసొచ్చింది. ఈ విషయమై విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చినప్పటికీ.. 'మా' సభ్యులు విష్ణునే ప్రెసిడెంట్​గా ఎన్నకున్నారు.
  2. మద్దతు విషయంలోనూ మంచు విష్ణు దూకుడు చూపించారు. నందమూరి బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు తదితరులు ఇతడికే అండగా నిలిచారు. సూపర్​స్టార్ కృష్ణను విష్ణు కలిసి మద్దతు కోరారు.
  3. తాను ఇవ్వాలనుకున్న హామీలను స్పష్టంగా వివరించి 'మా' సభ్యులను ఆకట్టుకోవడంలో విష్ణు సకెస్స్​ అయ్యారు.
  4. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్​రాజ్​ను గతంలో 'మా' రెండుసార్లు నిషేధించింది. ఇది విష్ణుకు అనుకూలంగా మారింది.
  5. ప్యానెల్ ప్రకటించినప్పుడు ప్రకాశ్​రాజ్ బలంగా కనిపించగా, ఆ తర్వాత మాత్రం ప్రతి విషయంలోనూ మంచు విష్ణు బలంగా కనిపించారు.
  6. అలానే విష్ణు, విజయంపై క్లారిటీతో ప్రత్యర్థిపై విమర్శలు చేయగా.. ప్రకాశ్​రాజ్ మాత్రం ప్రతివిమర్శలు తక్కువగా చేస్తూ, డిఫెన్స్​లో పడిపోయారు. ఇది విష్ణుకు కలిసొచ్చింది.
  7. విష్ణు తరఫు నుంచి విష్ణు, మోహన్​బాబు పలు వీడియోలు, ఆడియో మెసేజ్​లు రిలీజ్​ చేస్తూ 'మా' సభ్యుల్లో నమ్మకాన్ని పెంచారు.

ABOUT THE AUTHOR

...view details