తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2020, 10:54 PM IST

Updated : Mar 3, 2020, 5:27 AM IST

ETV Bharat / sitara

ఎన్టీఆర్​ సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నా: రానా

రానా దగ్గుబాటి.. ఏ పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. అతడు సినిమాలో నటించాడంటే ఆ చిత్రంలో ప్రత్యేకత ఉంటుందని సినీ పేక్షకుల నమ్మకం. 'బాహుబలి'తో అంతర్జాతీయ నటుడిగా గుర్తింపు పొందిన రానా.. వెండితెరకు పరిచయమై నేటికి పదేళ్లు. ఈ నేపథ్యంలో అతడు నటుడిగా ఎలా మారాడంటూ తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది సురేశ్​ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ​.

rana
రానా

'రానా నటుడవుతాడని ఎప్పుడూ అనుకోలేదు' అని అంటున్నాడు టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు వెంకటేశ్. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన 'లీడర్‌' సినిమాతో అర్జున్‌ ప్రసాద్‌గా వెండితెరకు పరిచయమై ఒక నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన టాలీవుడ్‌ యువ హీరో రానా దగ్గుబాటి. ఈ ఏడాదితో అతడు వెండితెరకు పరిచయమై సరిగ్గా పదేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి తప్పిన రానా నటుడిగా ఎలా మారడానే విషయాన్ని తెలియచేస్తూ ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించారు. తాజాగా సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ దీనికి సంబంధించి ఛాప్టర్‌1 వీడియోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఈ వీడియోలో రానా తండ్రి సురేశ్‌బాబు, బాబాయ్‌ వెంకటేశ్‌తోపాటు దర్శకులు క్రిష్‌, నాగ్‌ అశ్విన్‌.. అతడి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా యువ హీరోలు చరణ్‌, బన్నీ, నాగచైతన్య.. రానా నటనను ప్రశంసిస్తూ కనిపించారు.

"మా నాన్న మెకానికల్‌ ఇంజనీర్‌, వెంకీ బాబాయ్‌ ఎంబీఏ. వాళ్లందరూ బాగా చదువుకున్నవారు. కానీ నేను పదో తరగతి ఫెయిలయ్యాను. జీవితంలో ఏం సాధించాలో తెలియకుండా, ఒక గోల్‌ అంటూ లేకుండా ఉన్నాననిపించేది. చరణ్‌, బన్నీ నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కెరీర్‌పై వాళ్లకి ఒక క్లారిటీ ఉండేది. నాకు సినిమా అంటే ఇష్టమని మాత్రమే నాకు తెలుసు. సినిమానే వృత్తిగా చేసుకోవచ్చని, జీవితం అంతా సినిమాలోనే జీవించవచ్చని ఒకానొక సమయంలో అర్థం చేసుకున్నాను. వీఎఫ్‌ఎక్స్‌ బిజినెస్‌ ప్రారంభించాను."

-రానా, కథానాయకుడు.

వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా మారిన రానా 85 సినిమాలకు పనిచేశాడు. 2006లో విడుదలైన 'సైనికుడు' సినిమాకిగాను బెస్ట్‌ విఎఫ్‌ఎక్స్‌ విభాగంలో నంది అవార్డును అందుకున్నాడు. అలాగే తన స్నేహితుడు ప్రకాశ్‌తో కలిసి 'బొమ్మలాట' సినిమాను రానా నిర్మించాడు. ఈ చిత్రం జాతీయ అవార్డును అందుకుంది.

నటుడిగా మారాలని నిర్ణయించుకున్నాక స్టంట్స్‌ స్కూల్‌కి వెళ్లి శిక్షణ తీసుకున్నాడు రానా. విదేశాలకు వెళ్లి నటుడికి కావాల్సిన ఎన్నో రకాల శిక్షణలను అవపోసన పట్టాడు. ఎన్టీఆర్‌ సినిమాలు చూసి తెలుగు నేర్చుకున్నానని ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి.. పవర్ స్టార్ వచ్చేశాడు.. అదిరిపోయిన 'వకీల్ సాబ్' ఫస్ట్​లుక్

Last Updated : Mar 3, 2020, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details