తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానాతో బాలకృష్ణ కాదు.. రవితేజ! - రానా రవితేజ న్యూస్​

మలయాళంలో విజయం సాధించిన 'అయ్యప్పనుమ్​ కోషియుమ్​' సినిమా తెలుగు రీమేక్​ హక్కులను ఓ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో రానాతో పాటు రవితేజ కీలకపాత్రల్లో నటించనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Raviteja, Rana will lead roles in ayyappanum koshiyum telugu remake!
రానాతో బాలకృష్ణ కాదు.. రవితేజ!

By

Published : Apr 16, 2020, 6:03 PM IST

రానా, రవితేజ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కబోతుందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మలయాళంలో ఘన విజయం అందుకున్న 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్, బిజూ మీనన్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. అందుకే అన్ని చిత్ర పరిశ్రమల దృష్టి ఈ సినిమాపై నిలిచింది.

బాలకృష్ణ కాదు రవితేజ

ఇప్పటికే ఓ పాత్ర కోసం రానా ఎంపికైనట్లు సమాచారం. మరో కథానాయకుడిగా రవితేజను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రవితేజ ఈ ప్రాజెక్టులో నటించేందుకు సుముఖంగా ఉన్నాడని వినికిడి. ముందుగా ఈ సినిమాను రానా, నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ, ఆ పాత్ర రవితేజను వరించిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

రవితేజ, రానా దగ్గుబాటి

ప్రస్తుతం రవితేజ 'క్రాక్‌' చిత్రంలో నటిస్తున్నాడు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో మరో చిత్రంలో చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇవే కాకుండా త్రినాథరావు నక్కినతో మరో చిత్రం చేయబోతున్నాడని వినిపిస్తోంది. ఇవన్నీ పూర్తయ్యాక ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో నటిస్తాడేమో చూడాలి.

రానా దగ్గుబాటి నటించిన 'అరణ్య' విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా చేస్తున్నాడీ హీరో.

ఇదీ చూడండి.. టిక్​టాక్ అమ్మాయికి ఆర్జీవీ సినిమా ఛాన్స్​

ABOUT THE AUTHOR

...view details