తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోలీస్ దుస్తుల్లో హీరో రవితేజ ఐదోసారి..! - raviteja with gopichand malineni

హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాలో పోలీస్ దుస్తుల్లో కనిపించనున్నాడని టాక్. ఇప్పటికే 'బలుపు' చిత్రం కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు.

రవితేజ

By

Published : Sep 29, 2019, 5:55 PM IST

Updated : Oct 2, 2019, 11:55 AM IST

మాస్ మహారాజా రవితేజ.. 'డిస్కో రాజా' షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత గోపీచంద్‌ మలినేనితో పనిచేయనున్నాడు. 'బలుపు' తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రమిది. ఇందులో ఈ కథానాయకుడికి జోడీగా శ్రుతిహాసన్‌ నటించనుందని సమాచారం.

ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా దర్శనమివ్వబోతున్నాడట ఈ హీరో. ఇదే నిజమైతే పోలీస్‌ దుస్తుల్లో రవితేజ కనిపించబోయే ఐదో చిత్రమవుతుంది. గతంలో 'విక్రమార్కుడు', 'ఖతర్నాక్‌', 'పవర్‌', 'టచ్‌ చేసి చూడు'లలో ఇదే గెటప్​లో కనిపించి అలరించాడు. అయితే వీటికి భిన్నమైన కోణంలో అతడి పాత్ర ఉండేలా తీర్చిదిద్దుతున్నాడట గోపీచంద్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి.. నేను చెప్పే వరకు నమ్మొద్దు: కియారా

Last Updated : Oct 2, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details