కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు 5 నెలలుగా థియేటర్లు మూతపడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాల విడుదల వాయిదా పడ్డాయి. అయితే ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓటీటీ ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'క్రాక్' చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
థియేటర్లలోనే రవితేజ 'క్రాక్' సందడి - actor raviteja latest news
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'క్రాక్'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందని వార్తలు రాగా.. కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం.
వెండితెరపైనే రవితేజ 'క్రాక్' సందడి
సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి కీలక పాత్రలో కనిపించనుంది. గ్రామీణ నేపథ్యం ఉన్న మహిళ జయమ్మగా సందడి చేయనుంది. తమన్ సంగీత స్వరాలు సమకూర్చాడు.