సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'. రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. దసరా కానుకగా విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ వినాయక చవితికి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.
'డిస్కోరాజా' రవితేజ వచ్చేది అప్పుడే..! - డిస్కోరాజా విడుదల తేదీ
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'డిస్కోరాజా'.. ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితికి ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నారు.
మాస్ మహారాజా రవితేజ
నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ సింహా ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తమన్ సంగీతమందిస్తున్నాడు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాత.
ఇదీ చూడండి: ఫస్ట్‌లుక్: 'గుంజన్ సక్సేనా'గా జాన్వీ లుక్ ఇదే
Last Updated : Sep 28, 2019, 6:05 PM IST