ఒక చిత్రంతో నవ్విస్తాడు. మరో చిత్రంతో భయపెడతుంటాడు. ఇంకోసారి థ్రిల్‌ని పంచుతుంటాడు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త రకమైన కథలతో సినిమాలు చేస్తూ వినోదం పంచుతున్న దర్శకనిర్మాత రవిబాబు. ఇపుడు తన ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై 'క్రష్' అనే చిత్రం చేయబోతున్నాడు.
క్రష్ ఫస్ట్‌లుక్: ఈసారి యువతే టార్గెట్ - ravibabu crush first look
విభిన్న కథలతో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోన్న దర్శకనిర్మాత రవిబాబు. తాజాగా ఇతడి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రాబోతుంది. దీనికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
రవిబాబు
కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా బుధవారం ఈ సినిమా టైటిల్ లోగోని విడుదల చేశారు. "యువతరం ఆలోచనలకి అద్దం పట్టే కథ ఇది. జనవరి 24 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. వేసవిలో విడుదల చేస్తాం" అని చిత్రవర్గాలు తెలిపాయి. ఇందులోని నటీనటులు, సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇవీ చూడడి.. అలా నటించాలంటే చాలా చిరాకేసింది: జాన్వీ