మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'ఖిలాడి' విడుదలను వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ ట్వీట్ పెట్టింది. "ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా సినిమా విడుదల కొంతకాలం వాయిదా వేస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన అనంతరం కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం" అని చిత్రబృందం తెలియచేసింది.
రవితేజ 'ఖిలాడి' విడుదల వాయిదా - రవితేజ ఖిలాడి వాయిదా
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'ఖిలాడి' విడుదల వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
'క్రాక్' అనంతరం రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'ఖిలాడి' చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ యంగ్ లుక్‌లో కనిపించనున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రతిఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.