1951లో విజయవాడలో ఘంటసాల లలిత సంగీత కచేరీ జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన నిర్మాత, దర్శకుడు, రచయిత రావి కొండలరావు.. అప్పడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకున్నారు.
ఘంటసాల ఆపగానే హాలు ఖాళీ - ravi kondala rao
విజయనగరంలో జరిగిన ఘంటసాల సంగీత కచేరీ గురించి నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు గుర్తు చేసుకున్న విషయాలు ఇవి.
"విజయనగరంలో 1951లో ఘంటసాల లలిత సంగీత కచేరి జరిగింది. గంటస్తంభం వెనకాల రేకులు, తడికెలతో కట్టిన నాటక మందిరంలో ఏర్పాటు చేశారు. నేను, నా మిత్రుడూ శ్రీకాకుళం నుంచి బయల్దేరి విజయనగరం వెళ్లాం. ఆలస్యం కావడం వల్ల మందిరం నిండిపోయింది. టికెట్లు కొనాలి. బుకింగ్‌లో ఉన్న అతను.. "మీరిద్దరూ చెరొక పదిహేనూ ఇవ్వండి. వెనకాల నించోవచ్చును" అన్నాడు. ముఫ్పైరూపాయలు ఇచ్చి వెనకాల సీట్ల వెనక నించున్నాము. ఆర్కెస్ట్రాతో, ఘంటసాల ‘'షావుకారు' పాటలు, ప్రవేటు పాటలూ పాడారు. గంటన్నర దాటాక, "బాబూ! మీరు అడిగిన పాటలు పాడడానికి సిద్ధంగాలేను. రిహార్సల్సు చేసుకున్నంత వరకూ పాడాను. మీరు అడిగిన పాటలు మా రాఘవులు పాడతాడు’" అని, రెండుమూడు పాటలు (స్వాతంత్య్రమే మా జన్మహక్కనీ..లాంటివి) రాఘవులు చేత పాడించారు. కానీ, ఆయన పాడడం అయిపోయిందని జనం వెళ్లిపోయారు".
-రావి కొండలరావు