తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో తెలుగు సినిమాలో రష్మిక! - శర్వా సరనస రష్మిక

కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్​గా రష్మిక ఎంపికైనట్లు సమాచారం.

Rashmika sings another telugu movie
మరో తెలుగు సినిమాలో రష్మిక

By

Published : Oct 24, 2020, 4:55 PM IST

కన్నడ అందాల సుందరి రష్మిక ఈ ఏడాది మహేష్‌బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో 'మీకు అర్ధమౌతుందా' అంటూ తనదైన శైలిలో మ్యానరిజం పలికించి అలరించింది. రష్మిక ప్రస్తుతం కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా అవకాశం దక్కించుకుందని వార్తలొస్తున్నాయి.

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే టైటిల్ పరిశీలించనున్నారట. చిత్ర షూటింగ్‌ను అక్టోబర్‌ 25న దసరా పండగను పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో ప్రారంభించనున్నారట. మొత్తం మీద రష్మిక తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

ABOUT THE AUTHOR

...view details