"నేను మొక్కలు నాటాను.. నా అభిమానులైన మీరూ ఈ మంచి పనిలో పాలుపంచుకోండి" అని ప్రముఖ కథానాయిక రష్మిక మందన పిలుపునిచ్చింది. 'మొక్కలు నాటండి' అంటూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంకా కొనసాగుతోంది. నటులు, ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి, మొక్కలు నాటి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల అక్కినేని సమంత ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక ఈ రోజు మొక్కలు నాటింది. తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతోపాటు ఆ ఫొటో తీయడానికి పడ్డ కష్టాన్ని కూడా సరదాగా రాసుకొచ్చారు.
ముగ్గురు హీరోయిన్లకు రష్మిక సవాల్..!
దక్షిణాధిన వరుస సినిమాలతో జోష్ మీదున్న యువ నటి రష్మిక.. తాజాగా ముగ్గురు హీరోయిన్లకు సవాల్ విసిరింది. వారిలో రాశీఖన్నా, కల్యాణి ప్రియదర్శన్, అషికా ఉన్నారు.
ముగ్గురు హీరోయిన్లకు రష్మిక సవాల్..!
ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తూ.. ప్రముఖ కథానాయిక రాశీ ఖన్నా, యువ కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, అషికా రంగనాథ్‌ను నామినేట్ చేశారు. వారితోపాటు తన అభిమానులకు మొక్కలు నాటమని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి.. ఈ 'హరిత' క్రతువులో భాగస్వామ్యం కావాలని కోరారు.