తెలంగాణ

telangana

బర్త్​డే పార్టీలో విజయ్ దేవరకొండ-రష్మిక

By

Published : Sep 24, 2020, 6:40 PM IST

Updated : Sep 24, 2020, 6:57 PM IST

కథానాయకుడు విజయ్ దేవరకొండ అమ్మ మాధవి పుట్టినరోజు వేడుకల్లో హీరోయిన్ రష్మిక పాల్గొంది. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్​గా మారింది.

rashmika at vijay devarakonda mother birthday party
విజయ్ దేవరకొండ రష్మిక

టాలీవుడ్​ క్యూట్​ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. చాలారోజుల తర్వాత ఓచోట కనిపించారు. అదేంటి వాళ్లిద్దరూ కలిసి ఏం సినిమాలో నటించట్లేదు కదా అని సందేహపడుతున్నారా, అలాంటిదేం లేదు. విజయ్ తల్లి మాధవి.. 50వ పుట్టినరోజు వారి ఇంట్లోనే జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి రష్మిక మాత్రమే హాజరైంది.

విజయ్-రష్మిక కలిసి 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో నటించారు. అందులో తొలి చిత్రం టాలీవుడ్​లో సంచలనం సృష్టించగా, రెండోది మిశ్రమ ఫలితం అందుకుంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్'లో(వర్కింగ్ టైటిల్) నటిస్తున్నారు విజయ్. పాన్ ఇండియా కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. కరోనా ప్రభావం వల్ల చిత్రీకరణ సగంలో నిలిచిపోయింది. త్వరలో తిరిగి దానిని ప్రారంభించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 24, 2020, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details