తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముందు ఆ పాటకు నో చెప్పా : రాశీఖన్నా - రాశీ ఖన్నా

'వెంకీమామ'లో సందడి చేసిన రాశీఖన్నా త్వరలో 'ప్రతిరోజూ పండగే'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలు పంచుకుందీ ముద్దుగుమ్మ.

rashi khanna
రాశీఖన్నా

By

Published : Dec 15, 2019, 6:32 AM IST

వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా. 'వెంకీమామ'తో తాజాగా హిట్‌ అందుకున్న ఈ భామ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఆమె నటించిన 'ప్రతిరోజూ పండగే' డిసెంబరు 20న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా రాశీ శనివారం మీడియాతో మాట్లాడింది. ఇందులో తను టిక్‌టాక్‌ స్టార్‌ ఏంజెల్‌ ఆర్నాగా సందడి చేస్తానని తెలిపింది.

'ప్రతిరోజూ పండగే'లో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ అమ్మాయికి టిక్‌టాక్‌ అంటే పిచ్చి. ఇప్పుడు టిక్‌టాక్‌ చాలా ఫేమస్‌ అయిపోయింది. వ్యక్తిగతంగా ఈ సినిమాకి ముందు నాకు టిక్‌టాక్‌ నచ్చేది కాదు. ఈ పిచ్చి వల్ల చాలా మంది చనిపోతున్నారు. కానీ ఈ పాత్ర కోసం టిక్‌టాక్‌ డౌన్‌లోడ్‌ చేసి, వీడియోలు చేశా. చాలా కష్టంగా అనిపించింది. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. టిక్‌టాక్‌లో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఈ యాప్‌ ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఓ నటిగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌.. ఇలా అన్ని సోషల్‌మీడియా ఖాతాల్లో చురుకుగా ఉండటం కష్టం."

రాశీఖన్నా

"టిక్‌టాక్‌ గురించి తెలుసుకున్న తర్వాత నా అభిప్రాయం మారింది. చాలా మంది దీని వల్ల సంతోషంగా ఉంటున్నారు. కొందరికి ఆఫర్లు కూడా వస్తున్నాయి. నా పాత్రతో అందరూ కనెక్ట్‌ అవుతారు. ఇది నవ్విస్తుంది. 'వెంకీమామ'లో హారికగా చాలా మోడ్రన్‌గా కనిపించా. ఈ సినిమాలో రాజమండ్రి అమ్మాయిగా.. సంప్రదాయంగా ఉంటా. ఒక్క పాటలో మాత్రం మోడ్రన్‌గా నటించా. హారిక, ఏంజెల్‌ ఆర్నా.. రెండు పాత్రలు పూర్తి విభిన్నంగా ఉంటాయి. నిజానికి 'వెంకీమామ'లో పాత్ర కాస్త సవాలుగా అనిపించింది. అందులో పొట్టి దుస్తులు మాత్రమే వేసుకునుంటా. ఇప్పుడు మోడ్రన్‌, సంప్రదాయం.. రెండు రకాల పాత్రలకు అలవాటుపడ్డా."

రాశీఖన్నా

"ఈ సినిమా కోసం సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి మరోసారి పనిచేశా. అతడు ఓ మంచి నటుడు. అన్ని పాత్రలు బాగుండాలి, సినిమా బాగా ఆడాలి అనుకునే వ్యక్తి. ఇప్పటి వరకు నేను కలిసి పనిచేసిన అందరు హీరోలతో మరోసారి నటించాలని ఉంది. చైతన్యతో నా జోడీకి మంచి స్పందన లభించింది. అందుకే ప్రత్యేకించి తనతో మరోసారి పనిచేయాలి అనుకుంటున్నా."

రాశీఖన్నా

"మారుతి ఓ మంచి దర్శకుడు. ప్రేక్షకులకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. నిజ జీవితంలోనూ ఆయన సరదాగా ఉంటారు. సినిమా చక్కగా రావడానికి ఏం కావాలి అనే విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి కావాల్సింది రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఓ రోజు నేను పాట పాడుతుంటే మారుతి విన్నారు. నీ స్వరం సినిమాలోని ఓ పాటకు సరిపోతుంది, దాన్ని నువ్వే ఎందుకు పాడకూడదు? అని అడిగారు. తొలుత నేను వద్దన్నా. చివరికి నాతోనే ఆ పాట పాడించారు."

రాశీఖన్నా

ఇవీ చూడండి.. బాలయ్య అరుపులకు అభిమానుల ఖుష్

ABOUT THE AUTHOR

...view details