తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అభిమాన నటుడితో పనిచేయటం ఆనందంగా ఉంది' - 'సంగ తమీజన్'

కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా నటించిన సినిమా 'సంగ తమీజన్'. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్​ అనంతరం విజయ్​తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది రాశీ.

రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి సెల్ఫీ

By

Published : Aug 3, 2019, 9:14 PM IST

కోలీవుడ్ నటుడు, నిర్మాత విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంగ తమీజన్'. ఇటీవలే చిత్రీకరణ పూర్తికాగా.. విజయ్​తో దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేసింది రాశీ.

"నా అభిమాన నటుడు విజయ్ సేతుపతితో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా" అంటూ రాసుకొచ్చింది రాశీ ఖన్నా. ఈ సినిమాలో మరో హీరోయిన్​గా నివేదా పేతురాజ్ నటించింది.

విజయ ప్రొడక్షన్ బ్యానర్​లో విజయ్ చందర్​ దర్శకత్వంలో వస్తోన్న 'సంగ తమీజన్' చిత్రంలోవిజయ్ మెుదటి సారి ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.

అక్టోబర్​లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది చిత్రబృందం. ప్రస్తుతం రాశీ ఖన్నా 'వెంకీ మామ'లో నటిస్తోంది.

ఇది సంగతి: జోక్​ను పెద్ద సీన్​ చేశారు: సుమలత

ABOUT THE AUTHOR

...view details