కన్నడ నటుడు యశ్ హీరోగా అలరించిన సినిమా 'కె.జి.ఎఫ్'. విడుదలైన అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న రెండో భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న రావు రమేశ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే వచ్చిన 'మజిలీ','మహర్షి' చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించాడీ నటుడు.
'కె.జి.ఎఫ్ 2'లో రావు రమేశ్ కీలక పాత్ర - రావు రమేశ్
విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరిస్తున్న రావు రమేశ్.. 'కె.జి.ఎఫ్-2' లో నటించే అవకాశం దక్కించుకున్నాడు.
కె.జి.ఎఫ్ 2లో రావు రమేశ్ కీలక పాత్ర
'కె.జి.ఎఫ్-2'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన మొదటి భాగం అభిమానులకు తెగ నచ్చేసింది. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.