భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ సారథ్యంలో టీమిండియా 1983 ప్రపంచ కప్ ఎలా సాధించిందన్న నేపథ్యంలో '83' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నెట్స్‌లో బాల్‌తో, బ్యాట్‌తో తీవ్రంగా శ్రమిస్తున్నాడు రణ్‌వీర్. అతడితో పాటు మిగతా జట్టు సభ్యులు బాగా కష్టపడుతున్నారు. నిజమైన ఆటగాళ్లలాగే శిక్షణ పొందుతున్నారు.
ప్రపంచకప్ కోసం రణ్‌వీర్ కసరత్తులు - 1983 ప్రపంచకప్
1983 ప్రపంచకప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘83’. రణ్‌వీర్ సింగ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ధర్మశాలలో విపరీతంగా కష్టపడుతున్నాడీ బాలీవుడ్ హీరో. సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో షేర్ చేశాడు.
ఈ శిక్షణ కోసం చిత్ర నటీనటులంతా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అక్కడ రణ్‌వీర్‌కు కపిల్‌తోపాటు పలువురు క్రికెటర్లు మెలకువలు నేర్పించారు. ఈ సినిమా కోసం చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియోను రణ్‌వీర్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. కపిల్ ఎక్కువగా ఆడే... నటరాజ్ షాట్‌ను రణ్‌వీర్ పర్‌ఫెక్ట్‌గా ఆడేందుకు చాలా శ్రమించాడు. మిగతా నటీనటులు ఎంతో సాధన చేస్తూ కనిపించారు.
భజరంగీ భాయ్‌జాన్, ఏక్తా టైగర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు.