బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే “గల్లీ బాయ్”గా అలరించాడీ కథానాయకుడు. టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ '83' లో కపిల్‌గా ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరించాడు. ఆ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు.
మరో క్రేజీ సినిమాలో గల్లీబాయ్ రణ్వీర్ - జయేశ్‌భాయ్ జోర్దార్
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మరో సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. హాస్యభరితంగా సాగే ఈ చిత్రానికి 'జయేశ్ భాయ్- జోర్దార్' అనే టైటిల్‌ని నిర్ణయించారు. దివ్యాంగ్ టక్కర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
మరో క్రేజీ సినిమాలో గల్లీబాయ్ రణ్వీర్
ఈ చిత్రానికి 'జయేష్ భాయ్-జోర్దార్' అనే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. నూతన దర్శకుడు దివ్యాంగ్ టక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించనుంది. అక్టోబరు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.