తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'83' సినిమా ఫస్ట్​లుక్ వచ్చేసింది - రణ్​వీర్ సింగ్

కపిల్ దేవ్ పాత్రలో రణ్​వీర్ సింగ్ నటిస్తున్న '83' సినిమా ఫస్ట్​లుక్​ వచ్చేసింది. చిత్ర విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉన్న సందర్భంగా దీన్ని పంచుకున్నాడీ బాలీవుడ్ హీరో.

ధర్మాశాలలో ఆనందంగా గడుపుతున్న '83' సినిమా సభ్యులు

By

Published : Apr 11, 2019, 6:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '83'. దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్ తన ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడీ నటుడు. 1983 క్రికెట్ ప్రపంచకప్​ నేపథ్యంలో రానుందీ సినిమా. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రలో రణ్​వీర్ కనిపించనున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

రణ్​వీర్ పంచుకున్న 83 సినిమా ఫస్ట్​లుక్

ప్రస్తుతం ధర్మశాలలో చిత్రీకరణ జరుపుకుంటోందీ చిత్రం. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటునే ఉన్నాడు రణ్​వీర్​. హీరో ప్రాక్టీసు చేస్తున్న వీడియోలు నెట్టింట ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుందీ సినిమా.

చిత్రంలోని ఇతర పాత్రల్లో చిరాగ్ పాటిల్, హార్డీ సంధు, జీవా, పంకజ్ త్రిపాఠి, సర్జత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.

ఇది చదవండి: '83' కోసం రణ్​వీర్ ప్రాక్టీస్​ షురూ

ABOUT THE AUTHOR

...view details