స్వర్ణ దేవాలయ సందర్శనలో దీపిక-రణ్వీర్ బాలీవుడ్ జోడీ దీపికా పదుకొణె-రణవీర్‌సింగ్.. స్వర్ణదేవాలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు గురువారం తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
ఏడేళ్లపాటు ప్రేమించుకుని, గతేడాది నవంబర్ 14న దీపిక-రణవీర్ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం కొంకణి, సింధీ సంప్రదాయాల్లో జరిగింది.
పెళ్లి తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున చిత్రం '83'. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. కపిల్ పాత్రలో రణ్వీర్, అతడి భార్య రోమీ భాటియా పాత్రలో దీపిక కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'చఫాక్' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది దీపిక. యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందుతోంది.
ఇది చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ జంట