తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆయనతో పనిచేస్తానని కలలోనూ అనుకోలేదు'

ఇంద్రధనుస్సులోని రంగుల్లాగా.. 'రంగ్​ దే' చిత్రంలో రకరకాల భావోద్వేగాలుంటాయని చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి అన్నారు. అందుకే ఈ సినిమాకు ఆ పేరు పెట్టామని ఆయన తెలిపారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ మీడియాతో ముచ్చటించారు.

By

Published : Mar 26, 2021, 6:34 AM IST

rangde director venky atluri interview
'ఆయనతో పనిచేస్తానని కలలోనూ అనుకోలేదు'

ప్రేమకథలపై పట్టున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వెంకీ అట్లూరి. 'తొలిప్రేమ'తో విజయాన్ని అందుకున్న ఆయన.. 'మిస్టర్‌ మజ్ను'తో రెండో ప్రయత్నం చేశారు. మూడో చిత్రంగా ఇటీవల 'రంగ్‌ దే' తెరకెక్కించారు. నితిన్‌, కీర్తిసురేశ్​ జంటగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన ఆ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

'రంగ్‌ దే' కథేమైనా రంగులతో ముడిపడి ఉంటుందా?

ఒకొక్క రంగు ఒకొక్క భావోద్వేగాన్ని సూచిస్తుందని చెబుతుంటారు కదా. అలా ఇంద్రధనస్సులోని ఏడు రంగుల్లాగా ఇందులో రకరకాల భావోద్వేగాలున్నాయి. అందుకే 'రంగ్‌ దే' అని పెట్టాం. హాస్యం, భావోద్వేగాలే ప్రధానంగా సాగే చిత్రమిది.

వెంకీ అట్లూరి

నితిన్‌తోనే ఈ సినిమా చేయడానికి కారణమేమిటి?

నేనీ కథ రాసుకునేటప్పుడు వేరే ఇద్దరు హీరోల్ని మనసులో అనుకున్నా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దగ్గరికి వచ్చాక నిర్మాత నాగవంశీ.. నితిన్‌ పేరు సూచించారు. ఆయన ఒప్పుకుంటారో లేదో అని నేను సందేహించా. ఆయన విన్న వెంటనే చేయడానికి అంగీకారం తెలిపారు. కీర్తి కూడా అంతే. ఆ ఇద్దరూ నా కంటే ఎక్కువగా ఈ కథను నమ్మారు. వాళ్ల నమ్మకం నాలో మరింత ధైర్యం నింపింది.

పీసీ శ్రీరామ్‌.. దేవిశ్రీప్రసాద్‌ తదితర సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. వాళ్లతో ప్రయాణం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

జీవితంలో కొంతమందితో కలిసి పనిచేయాలనుకుంటాం. పీసీ శ్రీరామ్‌ సర్‌తో కలిసి పనిచేస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. ఆయనవల్లే ఈ సినిమాను 64 రోజుల్లో పూర్తి చేశాం. ఇక దేవిశ్రీప్రసాద్‌ అయితే ఆయన పాటలు ఒకెత్తు, నేపథ్య సంగీతం మరో ఎత్తు.

ఇదీ చూడండి:'ఎన్టీఆర్‌తో పనిచేయడమే నా కల'

ABOUT THE AUTHOR

...view details