బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది అతడి సోదరి రిద్ధిమా కపూర్ సహ్ని. తన సోదరుడితో ఉన్న పాత చిత్రాలను షేర్ చేస్తూ.. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. రణ్‌బీర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది రిద్ధిమ.
రణ్‌బీర్ బర్త్‌డే: సోదరి రిద్దిమా విషెస్ - రిద్ధిమా కపూర్
రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది అతడి సోదరి రిద్ధిమా కపూర్ సహ్ని. ఈ సందర్భంగా రణ్‌బీర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.
సోదరుడితో అనుబంధాన్ని గుర్తుచేస్తున్న రిద్ధిమా కపూర్
రణ్‌బీర్ కపూర్ నేడు (సెప్టెంబరు 28) 38వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడీ హీరో. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఆలియా భట్ నాయిక. దీంతో పాటు 'షంషెరా', లవ్ రంజన్‌తో ఓ సినిమాలో నటించడానికి రణ్‌బీర్ అంగీకరించాడు. చివరిసారిగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన 'సంజు' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు.