'ఇలాంటివి అడుగుతారని తెలిస్తే వచ్చేవాణ్ని కాదు' అని నవ్వులు పూయిస్తున్నారు యువ కథానాయకుడు నాని. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'నంబరు 1 యారి' కార్యక్రమానికి దర్శకుడు శివ నిర్వాణ, నాయిక రీతూ వర్మతో కలిసి విచ్చేసి సందడి చేశారాయన. 'స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత' అని రానా అడగ్గా, 'మా ఆఫీసు లైనే అది' అంటూ సమాధానం చెప్పి, కడుపుబ్బా నవ్విస్తున్నారు నాని. 'అసలు ఇది ఎందుకుందిరా అనిపించిన బాడీ పార్ట్ ఏంటి?' అని ప్రశ్నించగా, 'ఇలాంటివి అడుతారని తెలిస్తే వచ్చుండేవాణ్ని కాదు' అని అలరిస్తున్నారు.
ఇలా అడుగుతారని తెలిస్తే వచ్చేవాణ్ని కాదు: నాని - నంబరు 1 యారి నాని టక్జగదీశ్
రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'నంబరు 1 యారి' కార్యక్రమానికి నాని హీరోగా నటిస్తున్న 'టక్ జగదీశ్' చిత్రబృందం హాజరై చేసిన అల్లరి అభిమానులను అలరిస్తోంది. ఏప్రిల్ 18న ఆహాలో ఈ షో ప్రసారం కానుంది. అప్పటి వరకు దీనికి సంబంధించిన ప్రోమో చూసేయండి..
నాని
నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన తొలి చిత్రమేది? అని రీతూని అడగ్గా సమాధానం తెలియక 'అయ్యో' అంటూ తను పలికిన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. వీళ్లు చేసిన అల్లరి, 'టక్ జగదీష్' చిత్ర సంగతులు తెలియాలంటే ఏప్రిల్ 18 వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి..