దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది చిత్రబృందం. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలను ఇస్తోంది. తాజాగా హీరో రానాతో కలిసి సినిమా విశేషాల గురించి ముచ్చటించారు. ఆ సంగతులు వారి మాట్లల్లోనే...
రానా: మీరు ముందు నుంచే స్నేహితులా? ఈ సినిమా ద్వారా దగ్గరయ్యారా?
తారక్: మేం సినిమా కన్నా ముందే మంచి స్నేహితులం. 'ఆర్ఆర్ఆర్' మా మధ్య బంధాన్ని మరింత పెంచింది. వృత్తిపరంగా ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవడం, మాలో ఉన్న ప్లస్, మైనస్‌లు తెలిశాయి. చరణ్ ఇంట్రావర్ట్.
రానా: తారక్, చరణ్‌లో ఎలాంటి మార్పును గమనించారు?
రాజమౌళి: తారక్ పుట్టుకతోనే టాలెంట్. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటికీ ఎనర్జిటిక్‌గానే ఉంటాడు. అయితే మొదట్లో కథలను ఎలా ఎంచుకోవాలో తెలీదు. ఎంచుకున్న కథ, తన పాత్ర సినిమాను సక్సెస్ చేస్తాయని అన్న అవగాహన కూడా లేదు. తర్వాత పరిపక్వత చెందాడు. ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలుసుకున్నాడు. యాక్టింగ్ విషయానికొస్తే అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాడు.
చరణ్‌లో కూడా మంచి ప్రతిభ ఉంది. అతడు కూడా తారక్ లాగే. మొదట్లో ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలీదు. క్రమక్రమంగా దానిపై అవగాహన పెంచుకున్నాడు. అయితే ఇప్పుడు తనలో ఉన్న బలాన్ని, ప్రతిభను గుర్తుపట్టి నమ్మడం ప్రారంభించాడు. తన మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలానో నేర్చుకున్నాడు. యాక్టింగ్ బాగా చేస్తాడు. ఓ సారి అతడు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఓ పదం సరిగ్గా రావట్లేదు. దాదాపు 70, 80 టేక్‌లు జరిగాయి. కానీ అతను సహనం కోల్పోలేదు. బాగా చెప్పాలన్నా తపనతోనే ఉన్నాడు. అది నాకు చాలా నచ్చింది.