తెలుగు చిత్రసీమలో ఆరడగుల అందగాళ్లలో ఎవరెవరున్నారని గుర్తు చేసుకుంటే ప్రేక్షకుల మదిలో ముందుగా మెదిలే రూపం దగ్గుబాటి రానా. ఇప్పడీ ఆరడగుల భల్లాల దేవ అమాంతంగా పదహారడగుల ఎత్తుకు ఎదిగిపోయాడు. అంతేకాదు.. అలా పొడుగైపోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ గమ్మత్తైన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు రానా.
ఈ ఫొటోలో రానా తాటి చెట్టులా పొడుగ్గా కనిపిస్తూ.. తలపై ఓ కౌబాయ్ క్యాప్‌తో.. నల్ల కళ్లద్దాలు పెట్టుకోని చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చాడు. సాధారణంగా సర్కస్‌లు, జాతర్లలో సాహసాలు చేసేవారు కాళ్ల కింద పొడవాటి కర్రలు పెట్టుకొని బ్యాలెన్స్‌గా నడుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇలా ఎత్తైన కర్రలపై ఒడుపుగా నిలబడటం, నడవడంలో ఎంతో శిక్షణ తీసుకుంటే తప్ప సాధ్యం కాదు.