తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2019, 11:16 PM IST

ETV Bharat / sitara

షూటింగ్​ మొదలైన రెండేళ్ల తర్వాత రానా 'ఫస్ట్​లుక్​'

ప్రముఖ నటుడు రానా త్వరలో సిపాయి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్​ 27న తొలిరూపు విడుదల చేసింది చిత్రబృందం.

రెండేళ్ల తర్వాత '1945' లుక్​ విడుదల

'బాహుబలి' వంటి భారీ విజయం అందుకున్న రానా... వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రుద్రమదేవి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో తనదైన నటనతో కమర్షియల్​ హీరోగా మారిపోయాడు. తాజాగా '1945' అనే సినిమాలో సిపాయి పాత్రలో కనువిందు చేయనున్నాడు.

కోలీవుడ్​ దర్శకుడు సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ 2017లో ప్రారంభమైంది. దాదాపు రెండేళ్ల తర్వాత దీపావళి కానుకగా ఫస్ట్​లుక్​ విడుదల చేసింది చిత్రబృందం.

చిత్రీకరణ ప్రారంభం తర్వాత రానా ట్వీట్​

తమిళంలో 'మదై తీరాతు' పేరుతో రూపొందుతుండగా... తెలుగు, హిందీ భాషల్లో '1945' అనే టైటిల్‌నే ఖరారు చేశారు. దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతోన్న'1945'లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఓ సిపాయిగా రానా నటించాడు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో... రెజీనా కథానాయిక. మూడు భాషల్లో వచ్చే ఏడాది జనవరి 24న సినిమా విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details