తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాక్షసితో పని చేస్తుంటే బాగుందన్న రమ్యకృష్ణ - తెలుగు సినిమా వార్తలు

పూరీ జగన్నాథ్​ తనయుడు ఆకాశ్​పూరీ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా ఛార్మితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది శివగామి.

రాక్షసితో పని చేస్తుంటే బాగుందన్న రమ్యకృష్ణ

By

Published : Nov 17, 2019, 5:40 PM IST

Updated : Nov 17, 2019, 7:01 PM IST

ఆకాశ్‌ పూరీ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'రొమాంటిక్​' చిత్రంలో... రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. కేతికాశర్మ కథానాయిక. అనిల్​ పాడూరి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. ఛార్మీ, పూరీ జగన్నాథ్​ సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్​లో పాల్గొన్న రమ్యకృష్ణ.. సెట్​లో ఛార్మితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

"గోవాలో జరుగుతున్న ‘రొమాంటిక్‌’ షూటింగ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఆకాశ్‌ పూరీ, కేతికాశర్మ జంట అందర్నీ ఆకట్టుకుంటుంది. అనిల్‌ పాడూరి ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌, నా రాక్షసి ఛార్మితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది."

-రమ్యకృష్ణ, సినీనటి

రమ్యకృష్ణ ట్వీట్​పై ఛార్మి సోషల్​మీడియా వేదికగా స్పందిస్తూ... మన రొమాంటిక్​ చిత్రానికి మరింత అందాన్ని తీసుకొచ్చారు 'లవ్​ యూ' అని పేర్కొంది.

బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆకాశ్​ పూరీ... కథానాయకుడిగా 'ఆంధ్రాపోరి', 'మెహబూబా' చిత్రాల్లో నటించాడు. గతేడాది విడుదలైన 'మెహబూబా' సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించాడు.

Last Updated : Nov 17, 2019, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details