'నా అల్లుడు' చిత్రంలో అత్తా అల్లుడిగా అలరించిన రమ్యకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మరోసారి కనువిందు చేయబోతున్నారని టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ఓ చిత్రానికి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. 'ఎన్టీఆర్ 30' వర్కింగ్ టైటిల్‌తో రూపొందనుంది. ఈ సినిమాలోనే కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అప్పుడేమో అత్తా-అల్లుడు.. మరి ఇప్పుడు? - ఎన్టీఆర్ రమ్యకృష్ణ
త్వరలో త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో రమ్యకృష్ణ నటించనుందని టాక్. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు జరపగా.. గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
రమ్యకృష్ణ
ఈ విషయమై ఇప్పటికే చిత్రబృందం రమ్యకృష్ణతో చర్చలు కూడా జరపగా.. ఆమె సుముఖత చూపారట. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఇదే సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉందని మరో ప్రచారం సాగుతోంది.
ఇదీ చూడండి ఎయిట్ప్యాక్ కోసం ఐదురోజుల పాటు నాగశౌర్య అలా!