తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కశ్మీర్ ​లోయలో.. ఫైట్​ మాస్టర్ల చిందులు' - dance

'వెంకీ మామ' సినిమా చిత్రీకరణలో ఫైట్​ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్​ డ్యాన్స్​ చేశారు. కశ్మీర్​ షెడ్యూల్​లో మంచుకొండల మధ్య ఇద్దరూ చిందేశారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్నారు.

రామ్ - లక్ష్మణ్

By

Published : May 17, 2019, 6:19 PM IST

ఫైట్​ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ కశ్మీర్​లో సరదాగా చిందులేశారు. విక్టరీ వెంకటేశ్​, నాగచైతన్య కలసి నటిస్తోన్న 'వెంకీ మామ' చిత్రానికి పోరాట సన్నివేశాలు సమకూరుస్తున్నారు ఈ కవల సోదరులు. ఈ సినిమాను కశ్మీర్​లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ ఈ ఫైట్​ మాస్టర్లు తమదైన రీతిలో నర్తించారు. మంచు కొండల మధ్య 'కశ్మీరు ​లోయలో.. కన్యాకుమారిలో' అంటూ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది.

ఆరు సార్లు నంది అవార్డు గెల్చుకున్న రామ్ - లక్ష్మణ్ తెలుగుతో పాటు తమిళంలోనూ చాలా సినిమాలకు ఫైట్లు రూపొందించారు.

ఈ చిత్రంలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్​పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి కే. ఎస్​ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్ బాబు, వివేక్ కూచిబొట్ల, విశ్వప్రసాద్ సినిమాను నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details