తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజమౌళి.. కొత్తగా ఆలోచించు : వర్మ - ramgopal varma talks about rajamouli

ప్రముఖ దర్శకుడు రాజమౌళిని సరికొత్తగా ఆలోచించాలని సూచించారు రామ్​గోపాల్​ వర్మ. 'ఆర్ఆర్ఆర్'ట్రైలర్ కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం వేచి చూస్తున్నామని ట్వీట్​ చేశారు.

ram
రాజమౌళి

By

Published : Jul 20, 2020, 9:23 PM IST

అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని ఉద్దేశించి రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్​లైన్​ మార్కెట్​వైపు ఆలోచించాలని సూచించారు. సరికొత్తగా ఆలోచించమని అన్నారు.

"హే రాజమౌళి.. ప్రస్తుతం ప్రపంచమంతా ఆన్‌లైన్‌కు మారుతోంది. ఈ పరిస్థితుల్లో అదే సరికొత్త మార్కెట్. మేమంతా 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం" అని ట్వీట్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ పై ఇంకా రాజమౌళి స్పందించలేదు.

గతంలోనూ వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణలు నడిచాయి. అవన్నీ నెటిజన్లను అలరించాయి.

లాక్​డౌన్​ నిబంధనలు సడలించినా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు షూటింగ్‌లు జరుపుకొంటున్నాయి. కానీ లాక్​డౌన్​లోనూ రామ్​గోపాల్​ వర్మ సినిమాల జోరు పెంచారు. ఒక దాని తర్వాత ఒకటి వరుస చిత్రాలను విడుదల చేస్తూ, కొత్త చిత్రాలను ప్రకటిస్తూ ముందుకెళ్లారు. ఇటీవల 'క్లైమాక్స్‌', 'నేక్డ్', 'కరోనా వైరస్‌' వంటి చిత్రాలను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు 'పవర్ స్టార్' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇది చూడండి : 'నా జీవితంలోకి గొప్ప ఆనందాన్ని తెచ్చావు నిక్​'

ABOUT THE AUTHOR

...view details