Ramesh babu last rites: అనారోగ్యం కారణంగా సూపర్‌స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. కృష్ణ, ఆయన సతీమణి కన్నీటి పర్యంతమయ్యారు.
నటుడు నరేశ్, గల్లా జయదేవ్, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు పలువురు సినీ నటులు భౌతిక కాయానికి నివాళులర్పించారు. మహేశ్ బాబు కరోనాతో ప్రస్తుతం క్వారంటైన్లో ఉండటం వల్ల అంత్యక్రియలకు రాలేకపోయారు.