తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జులై 12న ఇన్​ స్టాలోకి రామ్​చరణ్​..! - ramcharan

జులై 12న ఇన్ స్టాలో తన అభిమానులను పలకరించేందుకు రాబోతున్నాడు రామ్​చరణ్. ఇటీవలే తెరిచిన ఖాతాలో ఇప్పటివరకు ఏ పోస్ట్ చేయలేదు మెగా పవర్​స్టార్.

రామ్​చరణ్

By

Published : Jul 10, 2019, 11:58 PM IST

మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్ ఇటీవలే ఇన్​స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. తాను జులై 12న ఇన్ స్టాలో అభిమానులు ముందుకు రాబోతున్నట్టు ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేశాడు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది రామ్​చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.

ఎట్టకేలకు ఇన్ స్టాలో మీ ముందుకు రాబోతున్నాను. నాకు తెలియని ఈ ప్లాట్​ఫామ్​ అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. -రామ్​చరణ్, వీడియో సందేశం.

ఇప్పటికే ఇన్ స్టా ఖాతా తెరిచిన రామ్​చరణ్ ఇంతవరకు ఏ పోస్ట్ పెట్టలేదు. కేవలం ప్రొఫైల్ ఫొటో మాత్రమే పెట్టాడు. జులై 12న తొలి పోస్ట్ పెట్టనున్నాడు.

ప్రస్తుతం రాజమౌళితో ఆర్​ఆర్ఆర్​ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు చరణ్​. జూనియర్ ఎన్టీఆర్​తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రామ్​చరణ్​ అల్లూరి సీతారామారాజు పాత్ర పోషిస్తుండగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్​ పాత్రలో కనిపించనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details