తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది" - రాజమౌళి

రామ్​చరణ్​ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశాడు ఎన్టీఆర్​. 'బీమ్​ ఫర్ రామరాజు' అనే పేరుతో ఈ సర్​ప్రైజ్​ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు యంగ్​టైగర్​.

Ramcharan Birthday Surprise Video From RRR movie
ఆలస్యమైనా.. గుర్తుండిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చారు

By

Published : Mar 27, 2020, 4:11 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'(రౌద్రం రణం రుధిరం). ఉగాది సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటు, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి, అభిమానుల్లో ఆసక్తి పెంచింది చిత్రబృందం. శుక్రవారం రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​.

'బీమ్‌ ఫర్‌ రామరాజు' పేరుతో సర్‌ప్రైజ్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. తెలుగు వీడియోను డీవీవీ మూవీస్‌, తమిళంలో జూ.ఎన్టీఆర్‌, హిందీలో అజయ్‌ దేవగణ్‌, కన్నడలో వారాహి, మలయాళంలో రామ్‌చరణ్‌ల సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

"ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది.." అంటూ ఎన్టీఆర్..​ చరణ్ పాత్రను పరిచయం చేశాడు. ఇందులో చెర్రీ అల్లూరి సీతరామరాజుగా కనపిస్తున్నాడు. మరోసారి తన మాస్​ లుక్​తో ఆకట్టుకున్నాడు చరణ్.

తొలిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కుమురం భీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి.. చిరుత నుంచి అల్లూరి సీతారామరాజు వరకు

ABOUT THE AUTHOR

...view details