తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విహారయాత్రలో చరణ్​-ఉపాసన.. సోషల్​ మీడియాలో ఫొటోలు వైరల్​.. - sneha reddy

Ramcharan: మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ తన సతీమణి ఉపాసనతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ ​మీడియాలో వైరల్​గా మారాయి.

ramcharan with upasana
భార్య ఉపాసనతో రామ్​చరణ్​

By

Published : Mar 8, 2022, 4:13 PM IST

Ramcharan: సినిమాలతో నిత్యం బిజీగా ఉండే మెగా హీరోలు.. కుటుంబాలకు సమయం కేటాయించి సరదాగా గడుపుతున్నారు. మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ తన భార్య ఉపాసనతో కలిసి ఫిన్లాండ్​కు విహారయాత్రకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చరణ్​ తన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఫిన్లాండ్​కు వెళ్లడానికి ముందే ఉపాసన 'రెండు సంవత్సరాల తర్వాత వెకేషన్​కు తీసుకెళ్తున్నందుకు​ థ్యాంక్యూ చరణ్​' అంటూ ట్వీట్​ చేశారు.

భార్య ఉపాసనతో రామ్​చరణ్​

ఇక మరో మెగా హీరో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ కుటుంబం కూడా విహారయాత్రకు వెళ్లింది. అల్లు అర్జున్​ తన భార్య పిల్లలతో కలిసి రాజస్థాన్​లోని జవాలి ప్రాంతానికి వెళ్లారు. జవాలి కొండల్లో చిరుతపులులను వీక్షిస్తున్న వీడియోను బన్నీ భార్య స్నేహారెడ్డి తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు.

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​​ నటించిన 'ఆర్​ఆర్​ఆర్'​ భారీ అంచనాల నడుమ మార్చి 25న విడుదల కాబోతుంది. ఇందులో చరణ్​తో పాటు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ హీరోగా నటించారు. బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడం వల్ల అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'పుష్ప-1' తో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్​ 'పుష్ప-2' పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇదీ చదవండి:Prabhas Marriage Date: 'ప్రభాస్​ పెళ్లి తేదీ అదే'

ABOUT THE AUTHOR

...view details